తమిళనాడులో తిరుప్పరంకుండ్రం వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశించినా దీపం ఎందుకు వెలిగించలేదో వివరణ ఇవ్వాలని సీఎం విజయ్ కు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ లేఖ రాసి షాక్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, పోలీసుల సూచనలు, అధికారిక ఉత్తర్వులు అన్నీ నివేదికలో పొందుపరచాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167(బి) ప్రకారం, ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ నివేదిక కోరినట్లు లోక్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.