150,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న తన అతిపెద్ద విభాగమైన ఐబిఎం కన్సల్టింగ్లోని చాలా ఉద్యోగాలకు యూఎస్ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను ఐబిఎం నిలిపివేస్తోంది. దీంతో ఉద్యోగులు యూఎస్ విడిచి ఇతర దేశాల్లో ఉన్న ఐపీఎం ఆఫీసులకు వెళ్లాలి లేదా ఈ ఏడాది చివరి నాటికి కంపెనీని విడిచి పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి యూనిట్ మేనేజర్లకు కంపెనీ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ నిర్ణయంపై నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగులకు మూడు వారాల సమయం ఉంటుంది.