రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం చాలా మేరకు ఆమె ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.బాలికను పర్యవేక్షిస్తున్న వైద్య బృందం బాలికతో ఆస్పత్రిలో కేక్ కట్ చేయించారు. ఆమె కోలుకున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ వైద్య బృందం కొన్ని ఫోటోలు విడుదల చేశారు. బాలిక మరింత వేగంగా, పూర్తిగా కోలుకోవాలని డాక్టర్లు, మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.

