డ్రగ్స్ వినియోగంపై ఈగల్ అధికారులు నిఘా పెంచారు. గచ్చిబౌలిలోని ఓ మెన్స్ పీజీ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎనిమిది మందికి డ్రగ్ టెస్టులు చేయగా.. ఆరుగురికి గంజా పాజిటివ్‌గా నిర్ధారణైనట్లు సమాచారం. వీరిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు తెలిసింది. పీజి హాస్టళ్లలో గంజాయి వినియోగం, డ్రగ్స్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువత నివసించే ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని పీజి హాస్టళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

