అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో లారా విలియమ్స్ 24 ఏళ్ల పాటు పనిచేసి, ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, బృందాలను నిర్మించి, కొత్త ఉద్యోగులకు మార్గనిర్దేశం చేసిన వ్యక్తికి చివరికి ఒక్క ఈమెయిల్‌తో వీడ్కోలు పలకాల్సి వచ్చింది. మరీ విచిత్రమేమిటంటే.. ఏఐ టూల్స్‌తో సొంతంగా డాక్యుమెంటేషన్ రూపొందించుకోవడం ఎలాగో ఇంజినీరింగ్ బృందాలకు శిక్షణ ఇస్తున్న సమయంలోనే ఉద్యోగం పోయినట్లు సమాచారం అందింది. మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల తన కెరీర్‌కు ఇలా ముగింపు వస్తుందని ఊహించలేదంటూ లారా చేసిన లింక్డ్ఇన్ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

