నేపాల్‌లో మరోసారి భూమి కంపించింది. ఆ దేశంలోని కోషి ప్రావిన్స్ ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) అధికారికంగా ప్రకటించింది. భూ ఉపరితలానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు భూకంప శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప కేంద్రం లోతు తక్కువగా ఉండటంతో దీని ప్రకంపనలు చుట్టుపక్కల దేశాలపైనా గట్టిగానే కనిపించాయి. నేపాల్‌తో పాటు సరిహద్దు దేశాలైన భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మరియు చైనాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం.