భారత్, నేపాల్ దేశాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నాగరికతా బంధాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ ప్రధానికి అపురూపమైన కానుకలను బహూకరించారు. అధికారిక పర్యటన నిమిత్తం భారత్ విచ్చేసిన నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాకు ప్రధాని మోదీ భేటీ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన కాశీ పవిత్ర గంగాజలం, వారణాసి బనారసి బ్రోకేడ్ శాలువాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన శ్రీకాళహస్తి కలంకారీ ‘సంపూర్ణ రామాయణం’ పెయింటింగ్‌ను ప్రధాని మోదీ ఆయనకు కానుకలుగా అందజేశారు.