విదేశీ పర్యటనల్లో రాహుల్ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిపై ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీకి ఏటీఎంలా పనిచేస్తున్నారని నబిన్ ఆరోపించారు. గతంలో అవినీతి పాలనకు చరమగీతం పాడుతామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.