కేరళ గాంధీ భవన్ లో ‘కాక్రోచ్ క్లబ్’ పేరుతో మహాత్మగాంధీ ఇప్పుడు బతికుంటే ప్రస్తుత రాజకీయ వాస్తవాలను ఆయనకు చూపించేలా ఓ స్కిట్ చేశారు. దీనికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు ఈ కాక్రోచ్ క్లబ్ ను దేశవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు. యువత వాయిస్ ను అందరికీ వినిపించే ప్రయత్నం చేయాలని సీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు నగరాల నుంచి జిల్లాలు, గ్రామాలకు తాము విస్తరించాలని సీజేపీ భావిస్తోంది. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో క్షేత్రస్దాయిలో పనిచేయడానికి సీజేపీ జోనల్ సభ్యుల్ని నియమించారు.