అక్కినేని హీరో నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సతీమణి శోభిత ధూళిపాళ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. నాగచైతన్యతో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆమె.. ‘హ్యాపీ బర్త్‌డే లవర్’ అంటూ ప్రేమపూర్వక క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా అవుతున్నాయి.