అక్రమంగా దేశంలోకి ప్రవేశం, ఇతర కారణాలతో 2023 నుంచి 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను ఇమిగ్రేషన్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా విడుదలైన యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) శాఖ నివేదికలు వెల్లడించాయి. వీరంతా అమెరికా సరిహద్దుల్లో తల్లిదండ్రులు వదిలేసిన, లేదా అనాథలుగా మారిన చిన్నారులు. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న సమయంలో పట్టుబడితే పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయే వారని ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. అటువంటి చిన్నారులకు ఇమిగ్రేషన్ సెంటర్లలో వసతి కల్పించి.. సంరక్షిస్తున్నట్లు తెలిపారు.