ఆంధ్రప్రదేశ్లో మేయర్లు, చైర్ పర్సన్ల ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ముహూర్తం ఖరారు అయింది. స్థానిక సంస్థల్లో కొత్త పాలన రేపు అంటే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఒకేసారి తొలి సమావేశాలు జరగనున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నికల ప్రక్రియను కూడా నిర్వహించనున్నారు. రేపటి తొలి సమావేశం నుంచే స్థానిక సంస్థల పాలకవర్గాల ఐదేళ్ల అధికారిక పదవీకాలం మొదలుకానుంది.