భాజపా ఎంపీ కంగనా రనౌత్ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విమర్శించిన ఆమె.. ఆయన ప్రవర్తన అసహనంతో ఊగిపోతున్నట్లుగా ఉందని అన్నారు. ఆర్ఎస్ఎస్, భాజపాలు కులతత్వం, పురుషాధిపత్య ధోరణితో వ్యవహరిస్తాయని రాహుల్ చేసిన వ్యాఖ్యల పైనా ఆమె స్పందించారు. ‘‘భాజపా పురుషాధిపత్య ధోరణి ఉన్న పార్టీ అయితే.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు పోరాడుతోంది? ఈ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌దే మహిళా వ్యతిరేక దృక్పథం’’ అని మండిపడ్డారు.