అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ ను తమ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ దెబ్బతీసిందని ఇరాన్ తాజాగా వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తున్న ఎఫ్-16 ఫైటర్ జెట్పై తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాడి చేసిందని.. విధిలేని పరిస్థితుల్లో ప్రాంతలోని ఎయిర్ బేస్ లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇరాన్ ఆర్మీ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ది చేసినట్లు చెప్పారు.