ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్‌ల రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. చెన్నై నగరంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఆయన పాలుపంచుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు.ఈ వేడుకలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ దిగ్గజం, సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలుసుకోవడం తనకు ఎంతో గౌరవంగా అనిపించిందని, ఆయన ఆశీస్సులు తీసుకున్నానని నారా లోకేశ్ తెలిపారు.