ఏ.కొండూరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పులి సంచారంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, పులి సంచార మార్గాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలకు చేరవేయాలి. విస్తృతంగా గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.