ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ సహా పలు చోట్ల ఉన్న సంస్థ కార్యాలయాలతో పాటు హైదరాబాద్ కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నేహ గ్రూప్ డైరెక్టర్లు రామ్ రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లో ఐటీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.