అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు భారత్ సహా.. ఇతర దేశాల్లో డేటా సెంటర్లను నిర్మించకుండా నిషేధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విదేశాల్లో కాకుండా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోనే డేటా సెంటర్ల నిర్మాణం జరగాలని, అందుకు కావలసిన విద్యుత్, స్థలం, ఇతర వసతులు తమ దేశంలో పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. తమ హెచ్చరికలను ధిక్కరించి విదేశీ గడ్డపై పెట్టుబడులు పెట్టే టెక్ కంపెనీలు తీవ్ర ఆర్థిక పరిణామాలు, ఊహించని పన్నుల భారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.