ఈ నెల 18న బాపట్లలో శ్రీతేజ, కౌశల్యకు వివాహ అనంతరం తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణం లో ఇవాళ తెల్లవారుజామున ఒంగోలు పరిధి పెళ్లూరులోని రైజ్ కాలేజీ వద్ద వీరి వాహనం అతివేగంతో అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా, నవ దంపతులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది.మృతులు డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మిగా గుర్తించారు.

