భూమిపై కాకుండా చంద్రుడిపై నివసిస్తూ పనిచేసే వ్యోమగాముల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నియామక ప్రక్రియ చేపట్టింది. చంద్రుడిపై మానవుల నివాసానికి అనువైన స్థావరం ఏర్పాటు చేయడం, అక్కడ పరిశోధనలు నిర్వహించడం నాసా ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి చంద్రుడిపై పనిచేయగల వ్యోమగాములను ఎంపిక చేసే అంశం చర్చనీయాంశమైంది. నాసా వ్యోమగాముల బృందంలో చేరేందుకు ఇది అసాధారణమైన సమయమని సంస్థ అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మన్ పేర్కొన్నట్లు వైస్ ప్రచురించిన కథనం వెల్లడించింది.

