రాజస్థాన్ లో జరిగిన గ్రామ స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. జిల్లా పరిషత్ లు, పంచాయతీలకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార బీజేపీని వెనక్కి నెట్టి పలు చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకుంటోంది. రాష్ట్రంలోని మొత్తం 37 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరగగా.. ఇందులో 24 చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అలాగే 419 పంచాయతీ సమితులకు ఎన్నికలు జరగగా.. ఇందులో ఏకంగా 177 చోట్ల హస్తం పార్టీ తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.