వైఎస్సార్ జిల్లాలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి జరిగింది. అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, పెట్రోల్ బాంబులతో బీటెక్ రవి అనుచరులు దాడికి దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ కోసం వెళ్తున్న అవినాష్‌రెడ్డిపై సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో పచ్చ గూండాలు దాడి చేశారు. దాడిలో నేరుగా బీటెక్ రవి, ఆయన సోదరులు పాల్గొన్నారు. దగ్గరుండి అవినాష్‌రెడ్డిపై బీటెక్ రవి దాడి చేయించారు. టీడీపీ గూండాల దాడిలో అవినాష్‌రెడ్డి కారు ధ్వంసమైంది.