సౌదీ అరేబియా రాజధాని రియాద్ పై హౌతీలు క్షిపణి దాడులకు పాల్పడ్డారు. మిస్సైల్ దాడిని దళాలు అడ్డుకున్నా శిథిలాలు పడడంతో కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) టవర్ దెబ్బతిన్నంది. రియాద్ లోని అత్యంత ఎత్తైన భవనాల్లో ఈ టవర్ ఒకటి. మిస్సైల్ దాడితో కొన్ని అంతస్తుల్లోని కిటికీలు పగిలిపోవడంతో పాటు పీఐఎఫ్ తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. క్షిపణి దాడిలో సమీపంలోని కొన్ని భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.