తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన సుచిత్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ అక్కడ హంగామా చేశాడు. తన అప్పులు తీర్చడానికి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ నివాసం ముందు ప్లెక్సీని ప్రదర్శించాడు. అక్కడున్న బాడీగార్డ్‌పై దాడి చేసేందుకు అతను ప్రయత్నించినట్లు సమాచారం. అనంతరం ఆవేశంతో తన ఛాతీ, చేతులపై కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.