దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నదిలో పేరుకుపోతున్న చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రత్యేక శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా రంగంలోకి దిగారు. షాలిమార్ బాగ్ ప్రాంతంలో నిర్వహించిన క్లీనింగ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని నదిలోకి దిగి చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, గాయకుడు బిస్మాయిల్ తదితరులు కూడా పాల్గొని నది శుభ్రతకు తమ వంతు సహకారం అందించారు.

