పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు AP ప్రభుత్వానికి చేరిందన్న సమాచారంతో తమిళనాడు ప్రభుత్వం తొలగించిన 15 మంది అధికారుల్లో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నట్లు ఇండియా టుడే కథనం వెల్లడించింది. దీంతో ఆరోపణలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన హ్వాషిన్, సియోన్, ఐవామెట్ సంస్థలకు సంబంధించిన సుమారు రూ.1,600 కోట్ల పెట్టుబడులు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడుల వ్యవహారానికి, తాజా డేటా లీక్ ఆరోపణలకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ మొదలైంది.

