మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆ రోజు భారీ పేలుడు శబ్దం వినిపించిందని, ఈ విషయాన్ని అక్కడ పనిచేస్తున్న ఇంజినీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపించకుండా, బ్యారేజీ కూలిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు రాజకీయ రాద్ధాంతం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోరూ.4 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన బ్యారేజీ విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

