తన గురువు ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా లొంగిపోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు హరీశ్ రావు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీళ్లు తరలించుకుపోవడానికి ఏడాది కాలంగా సర్వే జరుగుతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి నాగార్జున సాగర్ కింద సొరంగం పనులు చేసేలా ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఒకవేళ ఈ సొరంగం పూర్తయితే.. నాగార్జున సాగర్ ఖాళీ అయిపోతుందన్నారు.

