అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపై కలుసుకుని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. సదస్సులో భాగంగా 21 ఆసియా-పసిఫిక్ దేశాల అధినేతలతో కలిసి నిర్వహించిన ‘ఫ్యామిలీ ఫొటో’ సెషన్లో ట్రంప్, జిన్పింగ్, పుతిన్ మధ్యలో నిలబడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫొటోకు ముందు ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించుకోవడం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.