బంగ్లాదేశ్ మరోసారి రాజకీయ హింస, అగ్నిప్రమాదాల గుప్పిట్లో చిక్కుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్లో తిరిగి దేశానికి వస్తానని ప్రకటించడం, ఆమె నేతృత్వంలోని నిషేధిత అవామీ లీగ్ పార్టీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది.దేశంలోని మొత్తం 64 పరిపాలనా జిల్లాలకు గాను 28 జిల్లాల్లో డజన్ల కొద్దీ నాటుబాంబులు పేలాయి. పలు వాహనాలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఢాకాలో జరిగిన పేలుళ్లలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫరీద్పూర్ ప్రాంతాల్లోని యూనస్‌కు చెందిన గ్రామీణ బ్యాంక్ శాఖలపై దాడులు చేసి తగలబెట్టారు.