దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE Advanced పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. 2027 పరీక్షలో తొలిసారిగా ఆన్‌స్క్రీన్ కాలిక్యులేటర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ విషయాన్ని పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ ఢిల్లీ అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులు 10 నుంచి 12 అంకెల డిస్ప్లే కలిగిన బేసిక్ ఆన్‌స్క్రీన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది సైంటిఫిక్ కాలిక్యులేటర్ కాదు. కేవలం ప్రాథమిక గణిత లెక్కలు చేసుకునేందుకు వీలుగా నాన్-సైంటిఫిక్ కాలిక్యులేటర్‌ను అందుబాటులో ఉంచనున్నారు.