భారత్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని, దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తయారీ రంగం బలహీనపడిందని, విద్యావ్యవస్థలోనూ లోతైన సమస్యలున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక విధానాలనే కొనసాగిస్తే మరో ఐదేళ్లు, పదేళ్లలో దేశం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మంగళవారం జరిగిన ముఖాముఖి చర్చలో రాహుల్ మాట్లాడారు.మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు తయారీ రంగాన్ని పునరుద్ధరించడంలో విఫలమయ్యాయని రాహుల్ విమర్శించారు.