ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పాలనలో కీలక ఘట్టానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తెరలేపింది. మండల, జిల్లా పరిషత్ ల పరోక్ష ఎన్నికలు, నూతన సభ్యుల పదవీకాలం ప్రారంభంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం రేపటి (నవంబర్ 19) నుంచి ప్రారంభం కానుండగా, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.