అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన వాయేజర్-1 అద్భుత రికార్డును సృష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ ఖగోళ పరిశోధక వ్యోమనౌక.. భూమి నుంచి సరిగ్గా ఒక ‘లైట్ డే’ దూరం (కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరం) చేరుకుంది. అంటే దాదాపు 2,600 కోట్ల కిలోమీటర్లు అన్నమాట. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా గుర్తింపు పొందింది. ఒక కాంతి సంవత్సరం దూరంలోకి వెళ్లడానికి ఈ వ్యోమనౌకకు మరో 18వేల ఏళ్లు పడుతుందని అంచనా