జగన్ అక్రమాస్తుల కేసులో ‘ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుదీర్ఘ కాలం తర్వాత మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 15 ఏళ్లుగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ.. తాజాగా దాల్మియా సిమెంట్స్ కు సంబంధించిన అంశంలో న్యాయస్థానంలో ఛార్జిషీట్ వేసింది. ఈ కేసులో జగన్తో పాటు పునీత్ దాల్మియా తదితరులపై మనీలాండరింగ్ అభియోగాలు మోపింది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఇప్పటికే తొమ్మిది ఛార్జిషీట్లు దాఖలు చేసింది.