ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో సొరంగాలు తవ్వి నీటిని దోపిడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. నాగార్జున సాగర్ ను తెలంగాణకు కాకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.చంద్రబాను, మోదీ, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పాలమూరుకు, నల్గొండ జిల్లాకు నీళ్ల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నల్గొండకు ఫ్లోరోసిస్ బహుమతిగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ ధ్వజమెత్తారు.