తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి తర్వాత రంగారెడ్డి జిల్లాలో 11.3 డిగ్రీలు, కామారెడ్డిలో 11.7 డిగ్రీలు, వికారాబాద్ లో 11.8 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 12 డిగ్రీలు, మరో 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి.