సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ‘‘సోనియాగాంధీ ఆత్మలో తెలంగాణ లేదు.. గుండెల్లోనూ లేదు. తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ భిక్ష కాదు.. ప్రజల పోరాటం ఫలితం. ఉద్యమ ఉప్పెనలో కొట్టుకుపోతామన్న భయంతోనే తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ కోణంలోనే చూసింది. ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ ఎప్పటికీ చెరిపివేయలేదు.