దేశంలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) రిజిస్ట్రేషన్ల విషయంలో ఆర్బీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. మొత్తం 63 సంస్థలకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. వీటిలో 49 ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ స్వయంగా రద్దు చేయగా, మరో 13 ఎన్బీఎఫ్సీలు, ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ) తమ రిజిస్ట్రేషన్లను సరెండర్ చేసింది. మనిభవ్నం హోమ్ ఫైనాన్స్ ఇండియా, సన్ సోర్స్ లీఫిన్, లియానర్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థల
రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది.