ఢిల్లీలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో ఓ ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. కళ్లముందే ఇల్లు కూలిపోవడం, అందులో నివసిస్తున్నవారు ప్రమాదంలో పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం ఎనిమిది మంది ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. పైకప్పు కూలడంతో వారంతా ప్రమాదంలో చిక్కుకున్నారు.