కోనసీమ జిల్లాలో బ్లో అవుట్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరుస బ్లో అవుట్ ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై డిప్యూటీ సీఎం.. జిల్లా కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు అధికారులు వివరించారు.