రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 26 వరకు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కె. లింగయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 నుంచి వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 4 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

