దక్షిణాఫ్రికాలో ఒకేరోజు జరిగిన రెండు వేర్వేరు సామూహిక కాల్పుల ఘటనల్లో 17 మంది మృతిచెందారు. పియేటర్మారిట్జ్బర్గ్ నగర శివార్లలోని స్వీట్వాటర్స్లో తూటాలతో దెబ్బతిన్న వాహనంలో ఎనిమిది మృతదేహాలను గుర్తించారు. మృతులు, కాల్పులకు పాల్పడిన నిందితుల వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. ఇక రాజధాని ప్రిటోరియా సమీపంలోని జెఫ్విల్లే అనధికారిక నివాస ప్రాంతంలో ఒక గుడిసెలో తుపాకీ గాయాలతో తొమ్మిది మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.