loader

దివంగత మీడియా దిగ్గజం రామోజీరావు జయంతిని ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 16న విజయవాడలో నిర్వహించిన రామోజీరావు 90వ జయంతి వేడుకల్లో సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి, సమాజానికి రామోజీరావు అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవిత ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ప్రతి ఏడాది రామోజీరావు జయంతి అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాల మధ్య నిర్వహించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON