‘హనుమాన్’ సినిమా యంగ్ హీరో తేజ సజ్జా తన బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెబుతూ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, చిరంజీవి, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని తేజ సజ్జా వివాహం జరగనుంది.