హైదరాబాద్లో తాగునీటి కొరత లేదని, వచ్చే వర్షాకాలం వరకు నగరానికి సరిపడా నీటి నిల్వలు రిజర్వాయర్లలో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మంత్రి ప్రకటనను ఉద్దేశించి సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇటీవల నేను విన్న బెస్ట్ జోక్ ఇదే. కాంగ్రెస్ జోకర్లను ఎన్నుకుంటే సర్కస్ ఆశించాలి మరి’ అంటూ సెటైర్ వేశారు.