జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మృతుడిని లతీఫ్ భట్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాది అదే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు అతడిని చుట్టుముట్టాయి. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు తప్పించుకునే మార్గాలను మూసివేసి ఆపరేషన్ ప్రారంభించాయి. అతడిని పట్టుకునేందుకు లేదా మట్టుబెట్టేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.