ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం నిల్వల్లో తేడాలు వచ్చినా, ధాన్యాన్ని పక్కదారి పట్టించినా సంబంధిత రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోనుంది. నిల్వల్లో లోటు ఏర్పడిన సందర్భాల్లో భారీ జరిమానాలు విధించడంతో పాటు, సంబంధిత మొత్తాన్ని వడ్డీతో సహా మిల్లర్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ధాన్యాన్ని తమ ఆధీనంలో ఉంచుకునే మిల్లర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ధాన్యం నిల్వల నిర్వహణ, లెక్కల సమర్పణ, ప్రభుత్వానికి బియ్యం అప్పగించే ప్రక్రియలో పారదర్శకత ఉండేలా కొత్త అగ్రిమెంట్లో నిబంధనలు పొందుపరిచింది.

