మహిళల ప్రిమియర్ లీగ్ ఐదో ఎడిషన్‌కు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్లో కీలక మార్పులు చేసింది. ఇప్పుడు బ్రబోర్న్‌లో జరగాల్సిన అన్ని మ్యాచ్‌లను ప్రఖ్యాత వాంఖడే స్టేడియానికి మార్చినట్లు బోర్డు వెల్లడించింది. బ్రబోర్న్ మ్యాచ్‌లను వాంఖడే స్టేడియానికి షిఫ్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 5న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌తో పాటు, ఫిబ్రవరి 7న జరిగే అట్టహాసమైన ఫైనల్ పోరు కూడా వాంఖడే స్టేడియా100% ఆతిథ్యమివ్వనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ,WPL టోర్నీల మధ్య తక్కువ సమయం ఉండటం వల్ల పిచ్‌లను సిద్ధం చేయడం గ్రౌండ్ సిబ్బందికి సవాలుగా మారనుంది.