నక్సల్ హింసతో గిరిజన వర్గాలే అత్యధికంగా నష్టపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ‘జన్జాతీయ గౌరవ్ దివస్’ కార్యక్రమంలో వర్చువల్గా ప్రసంగించారు. గిరిజన వీరులు తిరత్ సింగ్, సిధో-కాన్హో, గోవింద్ గురు, రాణి గైదిన్ల్యూ, టాంట్యా భిల్, అల్లూరి సీతారామరాజు, రాణి దుర్గావతి త్యాగాలను మోడీ గుర్తుచేశారు. 2021లో ప్రారంభమైన జన్జాతీయ గౌరవ్ దివస్ జాతీయ వేడుకగా విస్తరించిందన్నారు. బిర్సా ముండా స్ఫూర్తితో అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.